ఇప్పటి వరకు వచ్చిన హార్రర్ కామెడీ చిత్రాలన్నీ దెయ్యాలు మనుషులని భయపెట్టడం అనే ఇతివృత్తంతో వచ్చినవే. కానీ, మొట్టమొదటిసారి తెలుగు సినిమా చరిత్రలో మనుషులు దెయ్యాలని భయపెట్టడం అనేది ఈ “ఆనందో బ్రహ్మ“ లో చూస్తారు. పూర్తి స్థాయి హార్రర్ కామెడీ కథాంశంతో దెయ్యాలకి, మనుషులకి మధ్య జరిగే ఘర్షణ లో ఎవరు గెలుస్తారనేది చాలా ఇంట్రస్టింగ్ గా ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తూ ఈ చిత్రం లో కొత్తగా చూపించారు. ఈ సినిమా మోషన్ పోస్టర్ ఈ మధ్యనే “ రెబెల్ స్టార్” ప్రభాస్ గారి చేతుల మీదుగా విడుదలైనప్పటి నుంచి ఈ సినిమాకు భారీ క్రేజ్ దక్కింది. ప్రస్తుతం పోస్ట్‌ప్రోడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ట్రేడ్ లో బిజినెస్ క్రేజ్ ని సొంతం చేసుకున్న ఈ క్రేజీ మూవీ ఆగస్ట్ 18న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
“పింక్” ”ఘాజీ” వంటి విబిన్నమైన చిత్రాలతో దేశవ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకున్న తాప్సి ప్రధానపాత్రలో, శ్రీనివాస్ రెడ్డి ,వెన్నెల కిషోర్,”తాగుబోతు” రమేష్,”షకలక” శంకర్, రాజీవ్ కనకాల ఇతర ముఖ్యపాత్రల్లో మహి వి రాఘవ్ రచన, దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందించబడింది. విజయ్ చిల్లా & శశి దేవిరెడ్డి గారి నిర్మాణంలో 70MM ENTERTAINMENTS బ్యానర్లో రుపొందించిన ఈ చిత్రం పూర్తి స్తాయి ఎంటర్టైనర్ గా తెరకెక్కింది.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ…. తాప్సీ వరుస సూపర్ హిట్స్ తో బాలీవుడ్ లో దుసుకుపోతున్న సంగతి తెలిసిందే. అలాంటి టైంలో తెలుగులో కంబ్యాక్ ఫిల్మ్ గా ఆనందో బ్రహ్మ చిత్రంలో నటించింది. ఈ చిత్ర ఫస్ట్ లుక్ అందరిని ఆకట్టుకుంది. హీరోయిన్ తాప్సీ సరికొత్తగా అద్భుతమైన పెర్ ఫార్మెన్స్ తో మరో కోణంలో చూడబోతున్నాం. దర్శకుడు మహి వి రాఘవ్ టెక్నికల్ గా, కమర్షియల్ గా చాలా బాగా తెరకెక్కించాడు. ప్రేక్షకులకు ఊహించని కామెడీ, థ్రిల్ అందించబోతున్నాం. ఇది కాన్సెప్ట్ ఫిల్మ్. హీరో హీరోయిన్లు కనిపించరు… కథ, క్యారెక్టర్లు మాత్రమే కనిపిస్తాయి. హార్రర్ చిత్రాల్లో సరికొత్త అనుభూతిని పంచబోతున్నాం. ప్రస్తుతం పోస్ట్ నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఆగస్ట్ 18న గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నాం. అని అన్నారు.
నటి నటులు: తాప్సి పన్ను,శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్,”తాగుబోతు”రమేష్,”శకలక”శంకర్,రాజీవ్ కనకాల, పోసాని కృష్ణ మురళి,తనికెళ్ళ భరణి,విద్యులేఖ రామన్,మరియు ప్రభాస్ శ్రీను
సంగీతం: k
ఛాయాగ్రహణం : అనిష్ తరుణ్ కుమార్
కూర్పు : శ్రావణ్ కటికనేని
ప్రొడక్షన్ డిజైన్: రామక్రిష్ణ &మోనికా సబ్బాని
సౌండ్ డిజైన్ : సింక్ సినిమా
విఎఫ్ఎక్స్ – ఎవా మోషన్ స్టూడియోస్
బ్యానర్ : 70 ఎంఎం ఎంటర్ టైన్ మెంట్స్
నిర్మాతలు : విజయ్ చిల్లా & శశి దేవిరెడ్డి
కథ, స్క్రీన్ ప్లే & దర్శకత్వం: మహి వి రాఘవ్