శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై వరుణ్ తేజ్ కథానాయకుడిగా రూపొందుతోన్న చిత్రం `ఫిదా`. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రేమమ్ ఫేమ్ సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తుంది.శక్తికాంత్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. ఆడియో సీడీలను నిర్మాత దిల్‌రాజు విడుదల చేయగా, తొలి సీడీని దర్శకుడు శేఖర్ కమ్ముల అందుకున్నారు. ఈ సందర్భంగా..
ప్రతి ప్రేక్షకుడు తన కుటుంబంతో కలిసి చూసే అందమైన ప్రేమకథ
హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ – “ఆనంద్ మంచి కాఫీలాంటి సినిమా ఎలాగో ఖుషీ లాంటి సినిమా ఫిదా. ఈ సినిమా కథను శేఖర్ చెప్పగానే నాకు ఇందులోని హీరో, హీరోయిన్ క్యారెక్టర్స్ బాగా నచ్చాయి. శేఖర్ కమ్ముల హీరోగా ఎవరినీ తీసుకోవాలనుకుంటున్నప్పుడు వరుణ్‌తో సినిమా చేద్దామని అన్నాను. ఎందుకంటే పవన్‌కళ్యాణ్‌గారు కెరీర్ స్టార్టింగ్‌లో తొలి ప్రేమ, సుస్వాగతం సినిమాలు చేశారు. అలా స్టార్టింగ్‌లో లవ్‌స్టోరీస్ చేస్తే హీరోలు ప్రేక్షకులకు దగ్గరవుతారు. అల్లు అర్జున్ చేసిన ఆర్య కూడా లవ్‌స్టోరీ చేశారు. ఓ అప్ కమింగ్ హీరో లవ్‌స్టోరీ చేయాలని నేను కోరుకుంటాను. అలా వరుణ్‌తో ఈ లవ్‌స్టోరీ చేద్దామని అనగానే శేఖర్ వరుణ్‌కు ఈ కథను చెప్పాడు. వరుణ్‌కు కథ నచ్చడంతో ట్రావెల్ స్టార్ట్ అయ్యింది. ఈ సినిమా 100 పర్సెంట్ శేఖర్ కమ్ముల స్టైల్ మూవీ. ఆయన ఆనంద్, హ్యాపీడేస్ సినిమాలను ఎలా చేశారు. అలా ఫిదా సినిమాను చేశారు. ఆనంద్, హ్యాపీడేస్ సినిమాలు తర్వాత శేఖర్ కమ్ములకు సరైన హిట్ కాలేదు. తర్వాత ఆ రేంజ్‌లో ఫిదా పక్కా శేఖర్ కమ్ముల స్టైల్ మూవీ. ఈ సినిమా ట్రావెల్ మరచిపోలేనిది. శేఖర్ కెరీర్‌లో ఆనంద్, హ్యాపీడేస్ తర్వాత ఫిదా మూవీ నిలుస్తుంది. మంచి టీంను తీసుకుని శేఖర్ స్టైల్‌లో చేయించుకున్నాడు. ది బెస్ట్ అవుట్‌పుట్ వచ్చింది. వరుణ్ గురించి మాట్లాడాలంటే, ముందు మెగాస్టార్ చిరంజీవిగారి గురించే మాట్లాడాలి. నేను ఆడియెన్‌గా ఉన్నప్పుడు స్టేట్‌రౌడీ సినిమా షూటింగ్‌లో ఆయన్ను దగ్గరగా చూశాను. తర్వాత అల్లుడా మజాకా సినిమాకు డిస్ట్రిబ్యూటర్‌గా ఆయన చేతుల మీదుగా షీల్డు తీసుకున్నాను. చిరంజీవిగారు ఉన్నారు కాబట్టే తర్వాత పవన్‌కల్యాణ్‌గారు, రామ్‌చరణ్, వరుణ్, సాయి ఇలా అందరూ హీరోలు అయ్యారు. కాబట్టి చిరంజీవిగారిని తలుచుకోకుండా వరుణ్‌కు సంబంధించిన ఏ ఫంక్షన్ జరగదు. ఫిదా వరుణ్ కెరీర్‌లో ది బెస్ట్ మూవీ అవుతుంది. పెర్ఫామెన్స్ పరంగా, కలెక్షన్స్ పరంగా వరుణ్‌కు ఇది బెస్ట్ మూవీ అవుతుంది. శేఖర్ తన సినిమాల్లో సెన్సిటివ్ పాయింట్ ఉంటుంది. అలాగే ఈ సినిమాలో కూడా తండ్రి కొడుకుల మధ్య సెన్సిటివ్ పాయింట్ ఉంటుంది. కాబట్టి అందరూ ప్రేక్షకులు తమ ఫ్యామిలీతో వెళ్లి చూసే సినిమా అవుతుంది. క్యూట్ లవ్‌స్టోరీ. సినిమా జూలై 21న సినిమా విడుదల కానుంది. ఆరు నెలల్లో హ్యాట్రిక్ కొట్టాం. ఫిదా మరో సక్సెస్ అవుతుంది“ అన్నారు.
తొలిప్రేమ, ఖుషీ సినిమాలు గుర్తుకొస్తాయి
శేఖర్ కమ్ముల మాట్లాడుతూ – “నా సినిమా వచ్చి చాలా రోజులైంది. నాకు కూడా టెన్షన్‌గానే ఉంది. సాధారణంగా నా సినిమాలను పోల్చుకుంటూ ఉంటాను. అలా చూసుకున్నప్పుడు `ఫిదా` చిత్రం నా కూతురులాంటి చిత్రం. చాలా ధైర్యంగా, నిజాయితీగా సినిమా ఉంటుంది. సినిమాను 70-80 రోజుల్లో పూర్తి చేసేస్తానని రాజుగారికి చెప్పాను. కానీ కొన్ని సమస్యలు వచ్చాయి. వరుణ్‌తేజ్‌కు కాలు ఫ్రాక్చర్ అయ్యింది. కొన్ని రోజులు వెయిట్ చేశాం. అలా కొన్ని రోజులు పోస్ట్ పోన్ అయ్యింది. అమెరికాలో షూటింగ్ చేస్తున్నప్పుడు కొన్ని సమస్యలు ఏర్పడ్డాయి. ఆ సమయంలో దిల్‌రాజుగారు వచ్చారు. మా సమస్యలను దిల్‌రాజుగారు తీరుస్తారు అనుకునే సమయంలోనే ఆయన శ్రీమతి అనితగారు హాస్పిటల్‌లో ఉన్నారని తెలిసింది. తర్వాత రోజే మాకు అసలు విషయం తెలిసింది. మేం షాక్ అయ్యాం. దిల్‌రాజు అదే రోజున రిటర్న్ అయ్యారు. ఇలా చాలా కష్టనష్టాలకోర్చి చేసిన ఫిదా సినిమాకు ట్రెమెండస్ రిజల్ట్ వస్తుందని భావిస్తున్నాను. రాజుగారు నిర్మాత కావడమే పెద్ద ఎసెట్. వరుణ్‌తేజ్, సాయిపల్లవి ఇలా అందరూ పెద్ద ఎసెట్‌గా నిలిచారు. సినిమా చాలా బాగా వచ్చింది. చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఎవరో ట్రైలర్‌లో లీడ్ పెయిర్‌ను చూసి ఖుషీ సినిమా గుర్తుకు వస్తుందని అన్నారు. నిజంగానే ఖుషీ, తొలిప్రేమ గుర్తుకొస్తుంది. ఇందులో పల్లవి పవన్‌కళ్యాణ్ ఫ్యాన్. పల్లవి ట్రెమెండస్ హీరోయిన్. గ్రేట్ పెర్ఫామెన్స్ ఇచ్చింది. వరుణ్ స్మైల్, స్టైల్ చాలా బాగుంటుంది. చాలా రోజుల తర్వాత హీరో క్యారెక్టర్‌ను చూస్తే కన్నీళ్లు పెట్టుకునే లవర్ పాత్రలో కనపడతాడు. అప్పుడెప్పుడో తొలిప్రేమలో పవన్ అలాంటి రోల్ చేశాడు. తర్వాత అలాంటి పాత్రలో వరుణ్ కనపడతాడు. వరుణ్‌లో అన్ని షేడ్స్ ఉన్నాయి. తనలో చిరంజీవిగారు, పవన్‌గారు, నాగబాబుగారు కనపడతారు. భాన్సువాడలో ప్రజలు ఎంతో సపోర్ట్ చేశారు. అలాగే యు.ఎస్‌లో అస్టన్‌లో ప్రజలు ఎంతో సపోర్ట్ చేశారు. శక్తికాంత్ చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. తనకు థాంక్స్. సీతారామశాస్త్రిగారి అబ్బాయి రాజా ఇందులో చాలా మంచి రోల్ చేశాడు. సినిమాను ఏడాదిపాటు తీశాం. కానీ రాజుగారు ఇచ్చిన సపోర్ట్ మరచిపోలేను. ఆయన స్కూల్ నుండి వచ్చిన సినిమాలాగే ఫిదా ఆడియెన్స్‌ను అలరిస్తుంది. నాకు సినిమా రిజల్ట్ తెలుసు. సినిమా చాలా డిఫరెంట్ మూవీగా మెప్పిస్తుంది“ అన్నారు.
అభిమానులు తలెత్తుకునే సినిమాలే చేస్తాను
వరుణ్‌తేజ్ మాట్లాడుతూ – “ఫిదా సినిమాకు శక్తికాంత్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. నా కెరీర్‌లో ది బెస్ట్ ఆల్బమ్ ఇచ్చారు. సీతారామశాస్త్రిగారు, చైతన్య, సుద్ధాల అశోక్‌తేజగారు మంచి సాహిత్యం అందించారు. శేఖర్‌గారు సినిమాలు చూస్తే ఆనంద్, హ్యాపీడేస్ సినిమాలు కల్ట్ మూవీస్. చాలా సెన్సిబుల్ పాయింట్స్‌తో సినిమాలు అలాగే ఈ సినిమా ఉంటుంది. దిల్‌రాజుగారికి థాంక్స్. 25వ సినిమాలను నిర్మించిన దిల్‌రాజుగారికి, మా ఫిదా సినిమాతో తదుపరి 25 సినిమాలు వరుసగా చేయాలని కోరుకుంటున్నాను. చాలా నమ్మకాన్ని ఇచ్చారు. ఆ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్. చాలా మాస్‌గా ఉంటుంది. సాయిపల్లవి హీరోయిన్ అనగానే, నేను సాయిపల్లవి నటించిన ప్రేమమ్ సినిమాను అప్పటికే చూడటంతో చాలా ఎగ్జయిట్ అయ్యాను. భానుమతి క్యారెక్టర్‌కు రెండు వందల శాతం న్యాయం చేసింది. సినిమా చూస్తే తను తప్ప ఆ క్యారెక్టర్ మరెవరూ చేయలేరని ప్రేక్షకులు అంగీకరిస్తారు. మా పెద్దనాన్న, బాబాయ్‌లాగానే కొత్త తరహా సినిమాలు చేయాలని ప్రయత్నిస్తున్నాను. రెండు, మూడు చోట్ల తప్పటడుగులు వేశాను. ఇకపై మంచి సినిమాలే చేస్తాను. అభిమానులు తలెత్తుకునేలా చేస్తాను. నేను ఇక్కడకు రావడానికి కారణం, నా బలం మెగాస్టార్ చిరంజీవిగారే. తర్వాత బాబాయ్‌గారే ఇష్టం. ఇక సినిమాను చూస్తే మీకు సినిమా తప్పకుండా నచ్చుతుంది. చాలా మంచి ఎమోషన్స్ ఉంటాయి. మంచి సంగీతం, సినిమాటోగ్రఫీ కుదిరాయి. సినిమా జూలై 21న విడుదలవుతుంది. సినిమా అందరికీ తప్పకుండా నచ్చుతుందని కోరుకుంటున్నాను“ అన్నారు.
బ్యూటీఫుల్ లవ్‌స్టోరీ
సాయిపల్లవి మాట్లాడుతూ – “ఈ సినిమాతో చాలా తీపి గుర్తులున్నాయి. ఇంత మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు శేఖర్ కమ్ములగారికి థాంక్స్. ఆయన దగ్గర నుండి ప్రొఫెషనల్‌గానే కాదు, పర్సనల్‌గా కూడా చాలా విషయాలు నేర్చుకున్నాను. బ్యూటీఫుల్ లవ్‌స్టోరీ. సినిమా చూసిన ప్రేక్షకులు చాలా హ్యాపీగా ఫీలవుతారు. అందరికీ థాంక్స్“ అన్నారు.
సుకుమార్ మాట్లాడుతూ – “శేఖర్ స్మైల్ చాలా స్వచ్ఛంగా ఉంటుంది. తన సినిమాలు చూస్తే ప్రేమ పుడుతుంది. శేఖర్ సినిమాలు చూస్తే నాకు అసూయ కలుగుతుంది. ఎందుకంటే పెద్ద సినిమాల్లో బాహుబలి సినిమాను నేను ఎప్పటికీ తీయలేను. అలాగే చిన్న సినిమాల్లో హ్యాపీడేస్ వంటి సినిమాను కూడా తీయలేను. ట్రై చేసి 100% లవ్ మూవీ చేశాను. ఏదైనా నెరేషన్ ఏ ఫ్లోలో ఉండాలనుకున్నప్పుడు శేఖర్ సినిమాలు చూస్తాను. దిల్‌రాజు సక్సెస్ సినిమాలను తన చేతిలో పెట్టుకుని తిరుగుతున్నారనపిస్తుంది. ఫిదా సినిమా విషయానికి వస్తే, వరుణ్ గురించి చెప్పాలి. వరుణ్ తప్పకుండా మంచి ఉన్నతికి ఎదుగుతాడు. తనకు సినిమాలంటే ప్యాషన్ ఉంది“ అన్నారు.
సంగీత దర్శకుడు శక్తికాంత్ మాట్లాడుతూ – “దిల్‌రాజుగారికి, శేఖర్ కమ్ముల గారికి థాంక్స్“ అన్నారు.
నాని మాట్లాడుతూ – “దిల్‌రాజుగారు ఫిదా సినిమా లైన్ చెప్పారు. చెప్పగానే ఇది ష్యూర్ షాట్ హిట్ అవుతుందని చెప్పాను. ఫిదా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది“ అన్నారు.
సీతారామశాస్త్రి మాట్లాడుతూ – “ట్రైలర్ చూడటం, పాటలు వినడంతో ప్రేక్షకులు ఫిదా అయ్యారు. శేఖర్ కమ్మని కాఫీలాంటి సినిమాతో కెరీర్‌ను స్టార్ చేసి అలాగే అహ్లాదకరమైన సినిమాలు చేస్తున్నాడు. తనతో మంచి బాంధవ్యం ఉంది. శక్తికాంత్ మంచి మ్యూజిక్ అందించాడు. వరుణ్ మంచి ఇంప్రెషన్ వేసేలా ఫిదాలో నటించాడనిపిస్తుంది. తను భవిష్యత్‌లో స్టార్ కన్నా కూడా మంచి నటుడిగా ఎదగాలని కోరుకుంటున్నాను“ అన్నారు.
వంశీ పైడిపల్లి మాట్లాడుతూ – “శేఖర్ కమ్ములగారి డాలర్ డ్రీమ్స్ సినిమా చూసి, ఆయన సినిమాలను ఫాలో కావడం మొదలు పెట్టాను. ఆయనకంటూ ఓ మార్కును క్రియేట్ చేసుకున్నారు. ఆనంద్, గోదావరి తర్వాత శేఖర్ గారి దర్శకత్వంలో వస్తోన్న లవ్‌స్టోరీ. వరుణ్ తన సినిమాలను ఎంచుకునే విధానం చూస్తే తను ఎలాంటి నటుడిగా ఎదగాలనుకుంటున్నాడనే విషయం మనకు అర్థమవుతుంది. యూత్‌కు బాగా నచ్చే సినిమా అవుతుంది. దిల్‌రాజుగారు విజయాల పరంపరను ఇలాగే కొనసాగించాలని కోరుకుంటున్నాను. శక్తికాంత్ చాలా మంచి మ్యూజిక్ అందించాడు. ఈ సినిమా యూనిట్‌కు ఆల్ ది బెస్ట్“ అన్నారు.
ఇదే కార్యక్రమంలో నేను లోకల్, శతమానం భవతి చిత్రాల 100 రోజుల షీల్డ్స్‌ను యూనిట్‌కు అందించారు.