ప్ర‌పంచ‌వ్యాప్తంగా జూన్‌ 16న గ్రాండ్ గా ఆది పినిశెట్టి న‌టించిన ఎడ్వంచ‌ర‌స్ థ్రిల్ల‌ర్ “మ‌ర‌క‌త‌మ‌ణి” విడుద‌ల‌

29

ఆది పినిశెట్టి, నిక్కి గ‌ర్లాని హీరో హీరోయిన్లుగా రిషి మీడియా, శ్రీ చ‌క్ర ఇన్నోవేష‌న్స్ బ్యాన‌ర్స్‌పై A.R.K శ‌ర‌వ‌ణ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రాన్ని రిషి మీడియా, శ్రీ చ‌క్ర ఇన్నోవేష‌న్స్ సంయుక్తంగా “మ‌ర‌క‌త‌మ‌ణి” చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దిబు నైనన్‌ థామస్‌ సంగీతం అందించిన ఆడియో ని ఇటీవలే నాని, అల్ల‌రి న‌రేష్ చేతుల మీదుగా విడుద‌ల చేశారు. ఈ ఎడ్వంచ‌రస్ థ్రిల్ల‌ర్ ని అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి జూన్ 16 న తెలుగు, త‌మిళ భాష‌ల్లో విడుద‌ల చేస్తున్నారు.
ఈ సంద‌ర్బంగా..

ద‌ర్శ‌కుడు ఎఆర్‌కె.శరవణన్‌ మాట్లాడుతూ – “భాహుబ‌లి చిత్రం తో ఇండియ‌న్ సినిమాలో టాలీవుడ్ స‌త్తాని ఛాటారు, ముందుగా తెలుగు ప్రేక్ష‌కుల‌ని నా ధ‌న్య‌వాదాలు. మా మరకతమణి సినిమా కథ కూడా యూనివర్సల్‌ పాయింట్‌తో రూపొందింది కాబట్టి ఈసినిమాను తెలుగులో కూడా చేశాము. న‌న్ను హీరో ఆదిగారు ముందు నుండే ఎంకరేజ్‌ చేశారు. అందుకు తగిన విధంగా సపోర్ట్‌ అందించారు. ఈ చిత్రం జూన్ 16న విడుదల చేస్తున్నాము” అన్నారు.

మ్యూజిక్‌ డైరెక్టర్‌ దిబు నినన్‌ థామస్‌ మాట్లాడుతూ – ”మ్యూజిక్‌ డైరెక్టర్‌గా నా తొలి తెలుగు సినిమా ని చాలా బాగా ఆద‌రించారు చాలా ఆనందంగా వుంది. మా సినిమాలో ఐదు పాటలుంటాయి. ప్రతి పాట డిఫరెంట్‌గా ఉంటుంది. ఈ చిత్రం ఆడియోలానే సినిమా కూడా పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను” అన్నారు.

ఆది పినిశెట్టి మాట్లాడుతూ – “పూర్తిగా ఈ సినిమా స్క్రిప్ట్‌ బేస్‌డ్‌ మూవీ. ఓ ఐదుగురి క్యారెక్టర్స్‌ను బేస్‌ చేసుకుని రన్‌ అవుతుంటుంది. స్క్రిప్టే సినిమాలో హీరో. ఇప్పటి వరకు నేను సీరియస్‌ పాత్రలే చేశాను. నేను నటించిన తొలి కామెడి సినిమా అని చెప్పొచ్చు. డైరెక్టర్‌ శరవణన్‌ ఆలోచనతో చేసిన ఈ కథ డిఫరెంట్‌గా ఉంటుంది. దిబు థామస్‌గారు తన ట్యూన్స్‌, బ్యాక్‌గ్రౌండ్‌తో సినిమాకు ప్రాణం పోశారు. అలానే కొటా శ్రీనివాస‌రావుగారు, బ్ర‌హ్మ‌నందం గారు కూడా న‌టించారు. చివ‌రి వ‌ర‌కూ ఓ సస్పెన్స్ ర‌న్ అవుతూ వుంటుంది. చూసిన ప్ర‌తిఒక్క‌రూ థ్రిల్ ఫీల‌వుతార‌నేది వాస్తవం, జూన్ 16న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది. ” అన్నారు.

న‌టీన‌టులు.. ఆదిపినిశెట్టి, నిక్కిగ‌ర్లాని, కొటాశ్రీనివాస‌రావు, బ్ర‌హ్మ‌నందం, ఆనంద్ రాజ్‌, అరుణ్ రాజ్‌, కామ‌రాజ్‌, రామ్‌దాస్ త‌దిత‌రులు న‌టించారు..

సంగీతం- దిబు నైన‌న్ థామ‌స్‌, సినిమాటోగ్రాఫ‌ర్‌- పి.వి.శంక‌ర్‌, ఎడిట‌ర్‌- ప్ర‌స‌న్న.జి.కె, నిర్మాతలు- రిషి మీడియా, శ్రీ చ‌క్ర ఇన్నోవేష‌న్స్‌, క‌థ‌,స్క్రీన్‌ప్లే,ద‌ర్శ‌క‌త్వం- A.R.K.శ‌ర్వ‌న‌ణ్

NO COMMENTS

LEAVE A REPLY