రామ్‌చరణ్‌కి 2016 చాలా గొప్ప ఏడాదిగా మిగిలింది. ఆయన కెరీర్‌లో అత్యంత భారీగా తెరకెక్కి విడుదలైన చిత్రాల్లో `ధ్రువ` ఒకటి. సినిమా విడుదలైనప్పటి నుంచే అటు విమర్శకుల నుంచి ఇటు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు పొందుతోంది. మౌత్‌టాక్‌తో సినిమా యునానిమస్ హిట్‌గా నిలిచింది. ఓ వైపు జనాలు పెద్ద నోట్ల రద్దుతో బాధపడుతున్నప్పటికీ `ధ్రువ`కు వారాంతంలో థియేటర్లు హౌస్ ఫుల్స్ కావడం విశేషం. సినిమా బావుంటే ఎన్ని ఇబ్బందులున్నా ప్రేక్షకులు ఆదరిస్తారనడానికి `ధ్రువ` పెద్ద నిదర్శనం.
అలాగే యుఎస్‌లోనూ వాతావరణం సానుకూలంగా లేనప్పటికీ చాలా చోట్ల థియేటర్లు హౌస్ ఫుల్ అటెండెన్స్ తో కనిపించాయి. అంటే `ధ్రువ`కున్నక్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. కేవలం మూడు రోజుల్లోనే `ధ్రువ` అక్కడ మిలియన్ డాలర్స్ మార్క్ ను క్రాస్ చేసింది. రామ్‌చరణ్ ప్రస్తుతం యుఎస్ఎలో టూర్‌లో ఉన్నారు. అందులో భాగంగానే ఆయన తన అభిమానులను, ప్రేక్షకులను కలుసుకుని మాట్లాడుతున్నారు.
రామ్‌చరణ్ మాట్లాడుతూ “నా ధ్రువ టీమ్‌తో యుఎస్ఎలో పర్యటించడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడి ప్రేక్షకులను కలుసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఇప్పటికైనా అది సాకారమైనందుకు ఆనందంగా ఉంది. త్వరలో హైదరాబాద్‌కి చేరుకుంటాను. అక్కడ కూడా నా అభిమానుల సమక్షంలో సక్సెస్‌ను పంచుకుంటాను. ధ్రువ గురించి అందరూ పాజిటివ్‌గా మాట్లాడుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదాలు“ అని అన్నారు. గీతా ఆర్ట్స్ పతాకంపై రూపొందిన చిత్రం `ధ్రువ`. రామ్‌చరణ్, రకుల్‌ప్రీత్‌సింగ్ జంటగా నటించిన ఈ సినిమాను అల్లు అరవింద్, ఎన్వీప్రసాద్ నిర్మించారు. సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహించారు.