‘ఒక్క అమ్మాయి తప్ప’ ప్లాటినమ్ డిస్క్ వేడుక

27

సందీప్ కిషన్, నిత్యామీనన్ జంటగా అంజిరెడ్డి ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజసింహ తాడినాడ దర్శకత్వంలో బోగాది అంజిరెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘ఒక్క అమ్మాయి తప్ప’. జూన్ 10న సినిమా విడుదలవుతుంది. మిక్కి జె.మేయర్ సంగీతం అందించిన ఈ సినిమా ప్లాటినమ్ డిస్క్ వేడుక విజయవాడ హాయ్ ల్యాండ్ లో అభిమానుల సమక్షంలో ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో హీరో సందీప్ కిషన్, సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు, హాయ్ ల్యాండ్ మేనేజింగ్ డైరెక్టర్ అల్లూరి వెంకటేశ్వరరావు, చిత్ర దర్శకుడు రాజసింహ, హాయ్ ల్యాండ్ జనరల్ మేనేజర్ కాంతారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా….

అల్లూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ‘’ఈ ఆడియో సక్సెస్ మీట్ ను ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా ఆనందగా ఉంది. సినిమా మ్యూజిక్ సక్సెస్ అయిన విధంగానే సినిమా కూడా పెద్ద హిట్ కావాలి’’ అన్నారు.

కాంతారావు మాట్లాడుతూ ‘’సందీప్ కు సరిపోయే టైటిల్. నేను చోటా కె.నాయుడుగారి సినిమాటోగ్రఫీకి పెద్ద అభిమానిని. ఆడియో సక్సెస్ అయిన విధంగానే సినిమా కూడా పెద్ద విజయాన్ని సాధిస్తుంది’’ అన్నారు.

చోటా కె.నాయుడు మాట్లాడుతూ ‘’నాకు విజయవాడ అంటే చాలా ఇష్టం. కొత్తబంగారులోకంకు విజయవాడ వచ్చాను. తర్వాత ఒక్క అమ్మాయి తప్ప సినిమా సందర్భంగానే ఇక్కడకు వచ్చాను. సినిమా కోసం ఆరు నెలలు కష్టపడ్డాం. సినిమా జూన్ 10న విడుదలవుతుందంటే కొంత టెన్షన్ గానే ఉంది. తప్పకుండా సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది’’ అన్నారు.

చిత్ర దర్శకుడు రాజసింహ మాట్లాడుతూ ‘’నేను పుట్టింది ఉయ్యూరులో, ఓ రకంగా చెప్పాలంటే విజయవాడకు చెందినవాడినే. నేను రచయితగా చాలా సినిమాలకు పనిచేశాను. దర్శకుడిగా నా తొలి చిత్రమిదే. టెన్షన్ గా ఉంది. జూన్ 10న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. సందీప్ కిషన్ నన్ను నమ్మి మూడేళ్లు నాతో పాటు ట్రావెల్ అయ్యారు. అలాగో చోటా కె.నాయుడుగారు కెమెరా మాంత్రికుడు ఆయన సినిమాను చిత్రీకరించి స్టైల్ చూసి ఆశ్చర్యపోవడం ఖాయం. చాలా సంవత్సరాలు పాటు ఈ సినిమా కథను మెటీరియలైజ్ చేయలేకపోయాను. అందుకు కారణం నాకు చోటాగారి వంటి వ్యక్తి దొరకలేదు. రాయడానికి, తీయడానికి కొద్దిగా కష్టమైన స్క్రిప్ట్. కానీ చోటాగారు సపోర్ట్ తో సినిమాను అద్భుతంగా తెరకెక్కించాం. మిక్కి జె.మేయర్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. నా భార్య శశి జ్యోత్స్న మూడు పాటలు రాయగా, కృష్ణచైతన్య, మీగడ రామలింగంగారు మంచి సాహిత్యాన్ని అందించారు. ఇక టైటిల్ విషయానికి వస్తే మన ప్ర‌తిజ్జ్ఞ‌ను తక్కువ చేసే ఉద్దేశం మాకు లేదు. ఓ చిన్నపిల్లాడు తన అమాయకత్వాన్ని చాటుకున్న పద్ధతినే టైటిల్ గా మార్చుకున్నాం. పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్. అలీగారు, సప్తగిరి, తాగుబోతు రమేష్, పృథ్వి తమ కామెడితో అందరినీ ఎంటర్ టైన్ చేయబోతున్నారు. సందీప్ కిషన్ పెర్ఫామెన్స్ అద్భుతంగా ఉంటుంది. ఇక నిత్యామీనన్ క్యారెక్టరైజేషన్ స్పెషల్ గా ఉంటుంది. సందీప్ కిషన్, చోటాగారి సపోర్ట్ తోనే ఈ సినిమా రూపొందింది. సినిమాను పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ ‘’హైదరాబాద్ లోని హైటెక్ ఫ్లై ఓవర్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఆ ఫ్లైఓవర్ పై ఓ బాంబ్ ఉంది. ఆ విషయం తెలియక ట్రాఫిక్ జాంలో చిక్కుకున్న ఇద్దరి వ్యక్తుల మధ్య ప్రేమ కథ జరుగుతుంది. వారు అక్కడ నుండి ఎలా తప్పించుకున్నారనేదే కథ. సినిమా అంతా నవ్వుతూనే ఉంటారు. థ్రిల్లింగ్ గా ఉంటుంది. కథను నమ్మి చేసిన సినిమా. ది గ్రేట్ ఫ్యాన్.కామ్ ద్వారా బైక్ పై నాతో కూర్చొని ఐదు కిలోమీటర్లు ట్రావెల్ చేసే అవకాశాన్ని ఓ అమ్మాయికి ఇస్తున్నాం. ఆక్షన్ పద్ధతిలో ఆ సీట్ కొనుక్కోవలసి ఉంటుంది. ఆ ఆక్షన్ ద్వారా వచ్చిన డబ్బులను ఓ అనాథశ్రమానికి డొనేట్ చేస్తాం. దీని వల్ల కొంత మంది అనాథలకు తిండి, చదువు దొరుకుతుందని భావిస్తున్నాం. జూన్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం. ప్రేక్షకుల సపోర్ట్ మాకు ఎంతో అవసరం’’ అన్నారు.

సందీప్ కిషన్, నిత్యా మీనన్ , రేవతి , రవి కిషెన్, అలీ, అజయ్,బ్రహ్మాజీ, తనికెళ్ళభరణి, రాహుల్దేవ్, పృథ్వీ, సప్తగిరి, తాగుబోతు రమేష్,నళిని, జ్యోతి,రేవతి తదితరులునటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌: ఛోటాకె.నాయుడు, ఆర్ట్‌: చిన్నా, మ్యూజిక్‌: మిక్కిజె.మేయర్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, పాటలు : శ్రీమణి, శ్రీ శశి జ్యోత్న్స మరియు డాక్టర్ మీగడ రామలింగ శర్మ , ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఆళ్ళ రాంబాబు, సహ నిర్మాతలు : మాధవి వాసిపల్లి, బోగాది స్వేచ్ రెడ్డి , నిర్మాత: బోగాది అంజిరెడ్డి, కథ, మాటలు,స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : రాజసింహ తాడినాడ.

NO COMMENTS

LEAVE A REPLY