డబ్బింగ్‌ పూర్తి చేసుకున్న ‘ఈ చరిత్ర ఇంకెన్నాళ్లు’

75

విజెవైఎస్‌ఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై వై. శేషిరెడ్డి సమర్పణలో తమిళ్‌లో సంచలన విజయం సాధించిన ‘తరకప్పు’ చిత్రంను తెలుగులో ‘ఈ చరిత్ర ఇంకెన్నాళ్లు’ పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు.

ఈ సందర్భంగా వై. శేషిరెడ్డి మాట్లాడుతూ..’తమిళ్‌లో ఘనవిజయం సాధించిన ‘తరకప్పు’ చిత్రాన్ని తెలుగులో ‘ఈ చరిత్ర ఇంకెన్నాళ్లు’ పేరుతో అనువదిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ చిత్ర హీరోలు సముద్రఖని, శక్తివేల్‌ పోటాపోటీగా నటించిన సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఉత్కంఠ భరితమైన స్క్రీన్‌ప్లేతో సాగే ఈ కథని దర్శకుడు రవి అద్భుతంగా తెరకెక్కించాడు. అలాగే రెండు ప్రేమ జంటల చిలిపి విన్యాసాలు యువతను ఆకట్టుకుంటాయి. ప్రస్తుతం డబ్బింగ్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెప్టెంబర్‌ రెండవ వారంలో ఆడియోని విడుదల చేసి..అక్టోబర్‌లో సినిమాని విడుదల చేయనున్నాము…అన్నారు.

శక్తివేల్‌ వాసు, సముద్రఖణి, వైశాలి, రియాజ్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: ఎమ్‌. రాజశేఖరరెడ్డి; ఫోటోగ్రఫీ: జోన్స్‌ ఆనంద్‌; సంగీతం: ఎఫ్‌.ఎస్‌. ఫైజల్‌; నిర్మాణం: విజెవైఎస్‌ఆర్‌ ఆర్ట్స్‌; దర్శకత్వం: రవి.

NO COMMENTS

LEAVE A REPLY