తెలుగు మీడియా కు ఆర్కా మీడియా వర్క్స్ కృతజ్ఞతలు

203

రెండు సంవత్సరాలకు పైగా మా బాహుబలి చిత్రాన్ని మీ భుజాలపై మోస్తూ, అద్భుతమైన కవరేజి ని అందించిన తెలుగు సినీ మీడియా మిత్రులకు పేరు పేరునా మా ధన్యవాదములు.

గత రెండు సంవత్సరాలు గా మీరు అందించిన ఈ కవరేజి వలన ఈ చిత్రం సినిమా ప్రేమికులకు మరింత దగ్గర అయ్యింది అనటం లో సందేహం లేదు. ఈ రెండేళ్లలో ఏమైనా చిన్న చిన్న తప్పిదాలు జరిగినా, ఎంతో ప్రొఫెషనలిజం తో మా చిత్రానికి అండగా నిలిచారు.

ఇటీవలే బాహుబలి కి జాతీయ ఉత్తమ చిత్ర పురస్కారం లభించినప్పుడు మీరు అందించిన కవరేజి మాకు ఎంతో ఉత్తేజాన్ని ఇచ్చింది. రాజమౌళి దర్శకత్వం లో రెడీ అవుతోన్న బాహుబలి రెండవ భాగానికి మీరు ఇదే తరహా సహకారాన్ని అందిస్తారని నమ్ముతూ, మరొక సారి మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాము.

– టీం ఆర్కా మీడియా వర్క్స్ , నిర్మాతలు

NO COMMENTS

LEAVE A REPLY