విజయ్ పోలీసోడు సెన్సార్ పూర్తి. ఆడియో తేదీ ఖరార్

5942

ఇళయతలపతి విజయ్ నటించిన “తెరి” చిత్రం తెలుగు లో “పోలీసోడు” అనే టైటిల్ తో విడుదల కానుంది. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమం విజయవంతం గా పూర్తి చేసుకుని, U సర్టిఫికేట్ ను దక్కించుకుంది.

ఈ చిత్రం ఆడియో ను 6వ తారీఖున భారీ ఎత్తున హైదరాబాద్ లో విడుదల చేసేందుకు దిల్ రాజు సన్నాహాలు చేస్తున్నారు . ఈ చిత్రానికి జి . వి . ప్రకాష్ కుమార్ చక్కటి సంగీతాన్ని అందించారు అని ఆయన అన్నారు. ‘రాజా రాణి’ చిత్రం తో మంచి పేరు సంపాదించుకున్న అట్లి దర్శకత్వం లో ముస్తాబవుతోన్న ఈ చిత్రం పై భారీ ఆశలు ఉన్నాయి.

భారీ వ్యయం తో, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని అట్లి తెరకెక్కించారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ చిత్రం కు ఏప్రిల్ లో భారీ రిలీజ్ ఉంటుంది.

విజయ్ , సమాంత, అమీ జాక్సన్, ప్రభు, రాధిక, మహేంద్రన్ వంటి ప్రముఖ నటులు ఈ చిత్రం లో ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు

దర్శకత్వం – స్క్రీన్ప్లే – అట్లి .ఫోటోగ్రఫీ – జార్జ్ సి విలియమ్స్ . ఎడిటర్ -అన్తోనీ రుబెన్ . సంగీతం – జి . వి . ప్రకాష్ కుమార్. ఎగ్జిక్యుటివ్ ప్రొడ్యూసర్ : సతీష్ , సహా నిర్మాతలు – శిరీష్ , లక్ష్మణ్. నిర్మాతలు – రాజు , కలయిపులి ఎస్ థాను.

NO COMMENTS

LEAVE A REPLY