విజయ్ అదిరింది కి అరుదైన గౌవరం…

20

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న 61వ ప్రతిష్టాత్మక చిత్రం అదిరింది. ఈ చిత్రం టీజర్ కు అద్భుతమైన స్పందన లభిస్తోంది. 1.5 మిలియన్ వ్యూస్ తో తెలుగు స్టార్ హీరోల చిత్రాలకు ధీటుగా వ్యూస్ రావడంతో ఆయన తెలుగు అభిమానులు ఫుల్ ఖుషీ గా వున్నారు. ఈ సినిమాతో తెలుగు లో విజయ్ తన సత్తా చూపించబోతున్నాడు. దాదాపు 100 కోట్లతో నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగు తమిళ భాషల్లో గ్రాండ్ గా రిలీస్ చేయనున్నారు. ఇక తాజాగా ఈ చిత్రానికి అరుదైన గౌరవం లభించింది. ప్రపంచ ప్రఖ్యాత లీ గ్రాండ్ రెక్స్ థియేటర్ లో ఈ చిత్రాన్ని ప్రదర్శించబోతున్నారు. పారీస్ లో ఉన్న ఈ థియేటర్ లో ఇప్పటివరుకు దకిణ భారతదేశం నుంచి బాహుబలి 2, కబాలి చిత్రాలు మాత్రమే ప్రదర్శింపబడ్డాయి. వాటి తరువాత మళ్లీ విజయ్ అదిరిందికి మాత్రమే ఈ అరుదైన గౌరవం లభించినట్లుగా చిత్ర బృందం తెలిపింది. అలానే పారీస్ తో పాటు యూఎస్ ఏ, లండన్, దుబాయ్, కెనాడా, మలేషియా తదితర దేశాల్లో అదిరింది భారీ స్థాయిలో విడుదల అవుతోంది. అక్టోబర్ 18న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల అవుతోంది.

ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ను మురళీ రామస్వామి, హేమా రుక్మిణి, తెన్నాండల్ స్టూడియోస్ ప్రై.లిమిటెడ్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెన్నాండల్ బ్యానర్లో నిర్మిస్తున్న వందో చిత్రం కావడం విశేషం. స్టార్ డైరెక్టర్ అట్లీ ఈ చిత్రానికి దర్శకుడు. ఆస్కార్ విన్నర్ ఎ.ఆర్.రెహమాన్ స్వరాలందిస్తున్నారు. తెన్నాండల్ స్టూడియోస్, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి తెలుగులో అదిరింది చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.

మురళీ రామస్వామి మాట్లాడుతూ… నార్త్ స్టార్ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ అధినేత శరత్ మరార్ తో కలిసి తెన్నాండల్ స్టూడియోస్ తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రాన్ని అందించనున్నాం. టీజర్ కు అద్భుతమైన స్పందన రావడం చాలా హ్యాపీ గా ఉంది. శరత్ మరార్ గారు ఈ ప్రాజెక్ట్ లో జాయిన్ కావడం చాలా సంతోషంగా ఉంది. తెలుగులో గ్రాండ్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. కాటమరాయుడు, సర్దార్ గబ్బర్ సింగ్ లాంటి భారీ చిత్రాలు నిర్మించిన శరత్ మరార్ గారికి టీవీ ఇండస్ట్రీలో కూడా చాలా మంచి పేరుంది. ఆయనతో అసోసియేట్ కావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. అని అన్నారు. ఓవర్ సీస్ లో ఈ చిత్రాన్ని భారీ రేంజ్ లో విడుదల చేస్తున్నట్లుగా తెలిపారు. దీపావళి కానుకగా అక్టోబర్ 18న ఈ చిత్రం ప్రేకకుల ముందుకి రాబోతుందని తెలిపారు.

శరత్ మరార్ మాట్లాడుతూ… విజయ్ 61వ చిత్రం, తెన్నాండల్ స్టూడియోస్ వందో చిత్రం అదిరింది సినిమాతో అసోసియేట్ కావడం చాలా హ్యాపీగా ఉంది. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ను తెలుగులో గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నాం. ఈ సినిమాతో విజయ్ కి తెలుగు మార్కెట్ రేంజ్ పెరుగుతుంది. విజయ్ కు తెన్నాండల్ స్టూడియోస్ కు, డిస్ట్రిబ్యూటర్స్ కు ల్యాండ్ మార్క్ సినిమాగా నిలుస్తుందని ఆశిస్తున్నాం. రాజా రాణి, తెరి వంటి కమర్షియల్ సూపర్ హిట్స్ ఇచ్చిన అట్లీ దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో డిస్ట్రిబ్యూటర్లు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అని అన్నారు. బాహుబలి 2, కబాలి తరువాత మళ్లీ అదిరింది మాత్రమే లీ గ్రాండ్ రెక్స్ లో ప్రదర్శింపబడుతుందని. ఇలాంటి అరుదైన గౌరవం పొందిన సినిమాగా అదిరింది ఓ రికార్డ్ క్రియేట్ చేసిందని తెలిపారు. ఇక అక్టోబర్ 18న దీపావళి కానుకగా ప్రేకకుల ముందుకి రాబోతున్న ఈ సినిమా కచ్ఛితంగా అలరిస్తోందని అన్నారు.

ప్రపంచం గర్వించదగ్గ చిత్రం బాహుబలి, సల్మాన్ ఖాన్ కు భారీ హిట్ అందించిన భజరంగీ భాయిజాన్ వంటి చిత్రాలకు కథ అందించిన విజయేంద్రప్రసాద్ అదిరింది చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే అందించడం విశేషం. ఈ చిత్రంలో విజయ్ తో పాటు ఎస్.జె.సూర్య, కాజల్ అగర్వాల్, సమంతా, నిత్యామీనన్, వడివేలు, కోవై సరళ, సత్యన్ మరియు సత్యరాజ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇండియాలోని పలు ప్రాంతాలతో పాటు యూరప్ లోని అందమైన లొకేషన్స్ లో ఈచిత్ర షూటింగ్ జరిగింది.

నటీనటులు – విజయ్, ఎస్.జె.సూర్య, కాజల్ అగర్వాల్, సమంతా, నిత్యామీనన్, వడివేలు, కోవై సరళ, సత్యన్ మరియు సత్యరాజ్

సాంకేతిక నిపుణులు
సంగీతం – ఎ.ఆర్.రెహమాన్
సాహిత్యం – వివేక్
సినిమాటోగ్రాఫర్ – జి.కె.విష్ణు
ఎడిటర్ – రుబన్
యాక్షన్ – అనల్ అరసు
కొరియోగ్రఫి – శోభి
స్టోరీ – విజయేంద్రప్రసాద్
స్క్రీన్ ప్లే – విజయేంద్ర ప్రసాద్, రమణ గిరివాసన్
నిర్మాతలు – మురళీ రామస్వామి, హేమా రుక్మిణి, తెన్నాండల్ స్టూడియోస్ ప్రై.లిమిటెడ్
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ – అట్లీ

NO COMMENTS

LEAVE A REPLY