మెద‌టి వీకెండ్‌కి ప్ర‌పంచ‌వ్యాప్తంగా 97 ల‌క్ష‌ల వ‌సూలుచేసిన‌ ‘వెంకటాపురం’

15

గుడ్ సినిమా గ్రూప్ పతాకంపై శ్రేయాస్ శ్రీనివాస్ & తుము ఫణి కుమార్ నిర్మాతలుగా తెరకెక్కుతోన్న సస్పెన్స్ థ్రిల్లర్ వెంకటాపురం ఈ నెల 12న గ్రాండ్ గా ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడ‌ద‌ల‌య్యి మంచి చిత్రంగా ప్ర‌శంశ‌లు పొందుతుంది. హ్యాపీడేస్ ఫేం యంగ్ హీరో రాహుల్, మహిమా మక్వాన్ జంటగా నటించారు. స్వామిరారా, రౌడీఫెలో చిత్రాలకు అసోసియేట్‌గా పనిచేసిన వేణు దర్శకత్వం వహించిన ఈ చిత్రం మెద‌టి వీకెండ్ కంప్లీట్ చేసుకుని 92 ల‌క్ష‌ల గ్రాస్ వ‌సూలు చేసింది. ఈ స‌మ్మ‌ర్ కి థ్రిల్ చేసేవిధంగా వుంద‌ని ప్రేక్ష‌కులు ఆద‌ర‌ణ ల‌భిస్తుంది.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ… ఊహకందని మలుపులతో స‌రికొత్త క‌థ‌నంతో ఆధ్యంతం ఆసక్తి కరంగా తెర‌కెక్కించిన చిత్రం మా వెంక‌టాపురం ఈ నెల 12న గ్రాండ్ గా ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడ‌ద‌ల‌య్యి మంచి చిత్రంగా ప్ర‌శంశ‌లు పొందుతుంది. వైజాగ్ నెప‌ధ్యంలో సాగే యూత్‌ఫుల్ థ్రిల్ల‌ర్ గా ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటుంది. హీరో రాహుల్ న్యూ లుక్ కోసం స్పెషల్ కేర్ తీసుకున్నారు. దర్శకుడు వేణు అద్భుతమైన సన్నివేశాలతో గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ఈ చిత్రాన్ని రూపొందించాడు. మా చిత్రానికి సాయిప్ర‌కాష్ కెమెరా వ‌ర్క్ హైలెట్ గా నిలుస్తుంది. ప్ర‌స్తుతం అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల నుండి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. ఈ మూడురోజుల‌కి 97 ల‌క్ష‌ల గ్రాస్ వ‌సూలు చేసింది. రోజు రోజుకి మౌత్ టాక్ పెరిగి క‌లెక్ష‌న్లు పుంజుకుంటున్నాయి. ఈ చిత్ర విజ‌యానికి స‌హ‌క‌రించిన అంద‌రికి హ్రుద‌య‌పూర్వ‌క శుభాకాంక్ష‌లు.. అని అన్నారు,,

నటీనటులు –
రాహుల్, మహిమా మక్వాన్, అజయ్, జోగిబ్రదర్స్, శశాంక్ తదితరులు
సాంకేతిక నిపుణులు –
ప్రొడక్షన్ కంట్రోలర్: వాసిరెడ్డిసాయిబాబు, డ్యాన్స్ మాస్టర్: అనీష్ విజ్ఞేష్, అనిత నాథ్, కెమెరా: సాయిప్రకాష్ ఆర్ట్: జె.మోహన్, మ్యూజిక్: అచ్చు, కొ-ప్రోడ్యూస‌ర్: ఉమాదేవి కున‌ప‌రాజు ప్రొడ్యూసర్స్: శ్రేయాస్ శ్రీనివాస్ & తుము ఫణి కుమార్, స్టోరీ, డైరెక్టర్: వేణు మాధికంటి.

NO COMMENTS

LEAVE A REPLY