ఏప్రిల్ లో విజయ్ పోలీసోడు భారి విడుదల

474

ఇళయతలపతి విజయ్ నటించిన “తెరి” చిత్రం తెలుగు లో “పోలీసోడు” అనే టైటిల్ తో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని తెలుగు లో నిర్మాత దిల్ రాజు మరియు కలయిపులి ఎస్ థాను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తెలుగు టైటిల్ ను అధికారికం గా ప్రకతిచటం జరిగింది.

‘రాజా రాణి’ చిత్రం తో మంచి పేరు సంపాదించుకున్న అట్లి దర్శకత్వం లో ముస్తాబవుతోన్న ఈ చిత్రం పై భారీ ఆశలు ఉన్నాయి. భారీ వ్యయం తో, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని అట్లి తెరకెక్కించారు.

“తుపాకి వంటి సూపర్ హిట్ చిత్రాలతో మంచి ఫాం లో ఉన్న విజయ్ హీరో గా, రాజా రాణి తో మంచి పేరు తెచ్చుకున్న అట్లి దర్శకత్వం లో వస్తోన్న ఈ చిత్రం తెలుగు లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ ద్వారా విడుదల అవుతుంది. ఈ చిత్రానికి తెలుగు లో పోలీసోడు అనే మాస్ టైటిల్ ను ఖరారు చేసాం. ఏప్రిల్ లో భారీ విడుదల కు ప్లాన్ చేస్తున్నాం “, అని దిల్ రాజు తెలిపారు.

ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ చిత్రం ఆడియో వివరాలను త్వరలోనే ప్రకటిస్తాం అని చిత్ర బృందం తెలిపింది.

విజయ్ , సమాంత, అమీ జాక్సన్, ప్రభు, రాధిక, మహేంద్రన్ వంటి ప్రముఖ నటులు ఈ చిత్రం లో ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు

దర్శకత్వం – స్క్రీన్ప్లే – అట్లి .ఫోటోగ్రఫీ – జార్జ్ సి విలియమ్స్ . ఎడిటర్ -అన్తోనీ రుబెన్ . సంగీతం – జి . వి . ప్రకాష్ కుమార్. సహా నిర్మాతలు – శిరీష్ , లక్ష్మణ్. నిర్మాతలు – రాజు , కలయిపులి ఎస్ థాను

NO COMMENTS

LEAVE A REPLY