RGV confirms his Bio pic about NTR

40

తెలుగువాడిని మొట్టమొదటిసారిగా తలత్తెకునేలా చేసింది NTR అనబడే మూడు అక్షరాలు.

ఆ పేరు వింటే చాలు తెలుగువాడి ఛాతి గర్వంతో పొంగిపోతుంది, స్వాభిమానం తన్నుకొస్తుంది.

ఆయన ఒక మహానటుడే కాదు,మొత్తం తెలుగు నేల ఆయనకు ముందు, ఆయన తర్వాత కూడా చూడని అత్యధిక ప్రజాదరణ కలిగిన మహా రాజకీయ నాయకుడు

నాకు ఆయనతో పర్సనల్ గా వున్న అనుబంధం ఏమిటంటే ఆయన బ్లాక్ బస్టర్ హిట్ అడవి రాముడు సినిమా చూడటానికి 23 సార్లు బస్ టికెట్ కి డబ్బుల్లేక 10 కిమీ దూరం కాలి నడకన వెళ్లేవాడిని.

అంతే కాకుండా NTR తెలుగు దేశం పార్టీ అనౌన్స్ చేసిన మొదటి మహానాడు మీటింగులో నేల ఈనినట్టు వచ్చిన లక్షలాది మందిలో నేనూ వున్నాను ..

అలాంటి అతి మామూలు నేను… ఇప్పుడు NTR జీవితాన్నే ఒక బయోపిక్ గా తెరకు ఎక్కించడం చాలా చాలా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను.

ఈ అత్యంత నిజమైన ఆ మహామనిషి NTR బయోపిక్ లో ఆయన శత్రువులెవరో ,నమ్మక ద్రోహులెవరో,ఎవరికీ తెలియని కాంట్రవర్సీల వెనకాల అసలు కాంట్రవర్సీలేమిటో అవన్నీ అశేష తెలుగు ప్రజానీకానికి అతి త్వరలో నా NTR చిత్రం లో చూపిస్తాను.

“ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని” అని రాయప్రోలు గారంటే, నేను ఒక ఫిల్మ్ డైరెక్టర్ కెపాసిటీలో కాకుండా 8 కోట్ల తెలుగు వాళ్లలో కేవలం ఒకడిగా ప్రపంచంలో వున్న ప్రతి తెలుగువాడికి చెప్పేది ..ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి తెలుగు భారతిని, పొగడరా నీ తండ్రి NTR ni

NO COMMENTS

LEAVE A REPLY