‘ఒక్క అమ్మాయి తప్ప’ పాటలు విడుదల

38

ప్ర‌స్థానం’ వంటి డిఫ‌రెంట్ మూవీతో సినిమా రంగానికి ప‌రిచ‌య‌మైన సందీప్‌ కిష‌న్‌ హీరో గా నటించిన చిత్రం ‘ఒక్క అమ్మాయి తప్ప’. కథా బలం ఉన్న సినిమాలకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చే విలక్షణమైన నటి నిత్యా మీనన్ ఈ చిత్రం లో హీరోయిన్ గా నటిస్తోంది. అంజిరెడ్డి ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎన్నో చిత్రాలకు రచయితగా పనిచేసిన రాజసింహ తాడినాడ దర్శకత్వంలో మంచి అభిరుచి గల నిర్మాత గా, ఎగ్జిబిటర్ గా పేరు తెచ్చుకున్న బోగాది అంజిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మిక్కి జె.మేయర్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఆదివారం హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగింది.

ఈ కార్యక్రమంలో సందీప్ కిషన్, నిత్యామీనన్, వి.వి.వినాయక్, బోయపాటి శ్రీను, గుణశేఖర్, సాయిదరమ్ తేజ్, పరుచూరి వెంకటేశ్వరరావు, ఎం.ఎస్.రాజు, జెమిని కిరణ్, ఛోటా కె.నాయుడు, గౌతంరాజు, నల్లమలుపు బుజ్జి, రాశిఖన్నా, రెజీనా, మిక్కి జె.మేయర్, రవికిషన్, మేర్లపాక గాంధీ, గౌతంరాజు, రవికిషన్, తనికెళ్ల భరణి, రాశిఖన్నా, లగడపాటి శ్రీధర్ తదితరులతో యూనిట్ సభ్యులందరూ హజరయ్యారు.

బిగ్ సీడీని వి.వి.వినాయక్ ఆవిష్కరించారు. ఆడియో సీడీలను సాయిధరమ్ తేజ్ ఆవిష్కరించి తొలి సీడీని బోయపాటి శ్రీనుకు అందజేశారు.

ఛోటా కె.నాయుడు మాట్లాడుతూ ‘’ హీరోయిన్ ఈ సినిమాలో చాలా కీ రోల్. దాన్ని నిత్యామీనన్ చేయడం ఆనందంగా ఉంది. నిత్యామీనన్ మా సినిమాకు బంగారం. తను లేకపోతే ఈ సినిమా లేదు. చాలా స్వీట్ పర్సన్. కమర్షియల్ యాంగిల్ లో కాకుండా ఒరిజినల్ కథలో ఏముందో అదే చేయమంది. ఈ కథను చాలా సంవత్సరాలుగా రాజసింహ ట్రై చేస్తున్నాడు. చాలా కారణాలతో ముందు కెళ్లడం లేదు. ఆ సమయంలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆళ్ల రాంబాబు, అంజిరెడ్డిగారిని ఒప్పించి సినిమా చేయడానికి ఒప్పించాడు. మిక్కీ తన ఇచ్చిన ట్యూన్స్ నుండి కొత్త మిక్కి పుట్టాడు. తను ఇంకా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడు’’ అన్నాడు.

మేర్లపాక గాంధీ మాట్లాడుతూ ‘’ఒక్క అమ్మాయి తప్ప విజువల్స్ చాలా బావున్నాయి. రాజసింహగారు రైటర్ నుండి దర్శకుడిగా మారారు. ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం’’ అన్నారు.

సందీప్ కిషన్ మాట్లాడుతూ ‘’ సినిమా మా మూడు సంవత్సరాల నమ్మకం. నా బెస్ట్ పెర్ ఫార్మెన్స్ చూస్తారు. ఆ క్రెడిట్ లో ఎక్కువభాగం నిత్యామీనన్ కే దక్కుతుంది. ఒక మంచి సినిమాలో, హిట్ సినిమానో తీయడానికి చేసిన ప్రయత్నం కాదు, గొప్ప సినిమా తీయడానికి చేసిన ప్రయత్నం. రాజసింహ కమర్షియల్ డైరెక్టర్, నాపై నమ్మకంతో ఈ కథను నాకు ఇచ్చినందుకు ఆయనకి థాంక్స్. ఈ సినిమా కోసం ఛోటా మామ డబ్బులు తీసుకోకుండా వర్క్ చేశారు. ’స్త్రీలను గౌరవిస్తే అక్కడ దేవతలుంటారు అని చెప్పే సినిమా. రొటీన్ లవ్ స్టోరీ తర్వాత మిక్కితో రెండోసారి వర్క్ చేస్తున్నాను. నిర్మాత అంజిరెడ్డిగారు మమ్మల్ని నమ్మి ఈ సినిమా చేశారు, ఆయనకు థాంక్స్. ఈ అందరికీ థాంక్స్’’ అన్నారు.

నిత్యామీనన్ మాట్లాడుతూ ‘’ ఈ సినిమాను హిట్ గా నేను ఫీలయ్యాను. ఎందుకంటే ఇది డైరెక్టర్స్ మూవీ. నేను చూసిన రైటర్స్ లో ఎంటర్ టైనింగ్ గా, కంటెంట్ బేస్డ్ గా గ్రిప్పింగ్ కథను రాసుకున్నారు. ఆడియెన్స్ సినిమా చూస్తున్నప్పుడు ఒక్క నిమిషం కూడా బోర్ ఫీల్ కారు. ఈ సినిమానే కాకుండా రాజసింహ చేసే ప్రతి సినిమా పెద్ద హిట్ అవుతుంది. సందీప్ అమేజింగ్ కోస్టార్. మిక్కీ వండర్ ఫుల్ సాంగ్స్ ఇచ్చాడు. ఆ సాంగ్స్ వినగానే సోల్ టచింగ్ గా అనిపించింది. సినిమాను అందరూ చూసి పెద్ద హిట్ చేయాలి’’ అన్నారు.

బోయపాటి శ్రీను మాట్లాడుతూ ‘’ రాజసింహ చాలా మంచి రచయిత. మంచి హార్డ్ వర్కర్. స్క్రిప్ట్ పరంగా నాకు సరైనోడులో ఆయన హెల్ప్ చేశారని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను. తెలుగులో అద్భుతమైన సంగీత దర్శకులున్నారు. కానీ మిక్కి జె.మేయర్ గారు మెలోడీ సాంగ్స్ ను అద్భుతంగా ఇస్తారు. సందీప్ కిషన్, నిత్యామీనన్ చాలా మంచి పెర్ ఫార్మర్స్ సినిమాలో వారి నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దర్శక నిర్మాతలకు ఈ సినిమా మంచి సినిమా కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

వి.వి.వినాయక్ మాట్లాడుతూ ‘’నాకు రాజసింహ ఏడేళ్ల క్రితం ఈ కథను నా కళ్లకు కట్టే విధంగా చెప్పాడు. ఈ కథను ఎవరికైనా ఇవ్వాలని తను ప్రయత్నించాడు కానీ తన కథకు తనే దర్శకుడు కావడం ఆనందంగా ఉంది. ఛోటా కె.నాయుడు వల్ల సినిమా బడ్జెట్ 25 కోట్లు కావాల్సింది, కానీ 15 కోట్లు మాత్రమే అయ్యిందనుకుంటున్నాను. సందీప్, నిత్యామీనన్ ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇది నా ప్రాజెక్ట్ లాంటిది. ఎందుకంటే ఈ సినిమా ప్రాజెక్ట్ కావడంలో నా పార్ట్ కూడా ఉంది. సందీప్ సినిమాలన్నీ ఒకలా ఉంటే ఈ సినిమాలో తన నటన మరోలా ఉంటుంది. సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

గుణ శేఖర్ మాట్లాడుతూ ‘’సందీప్ ప్రస్థానం నుండి తన కెరీర్ ను డిఫరెంట్ గా స్టార్ట్ చేశాడు. నిత్యామీనన్ వల్ల ఈ సినిమాకు పత్యేకమైన గుర్తింపు వచ్చింది. సినిమాపై మంచి అంచనాలున్నాయి. నా దర్శకత్వంలో వచ్చిన ఒకట్రెండు సినిమాల్లో తప్ప అన్నింటిలో పార్ట్ అయ్యాడు. కాంప్లికేటెడ్ పాయింట్ ను ఎన్నుకుని, కొత్త ఆలోచనతో చేసిన సినిమా. తప్పకుండా సినిమా విజయవంతమవుతుంది’’అన్నారు.

సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ ‘’సందీప్, నేను మొదటి సినిమా నుండి మా సినిమాల విషయంలో డిస్కషన్స్ పెట్టుకునేవాళ్లం. తను నాకు మంచి మిత్రుడు. నా మొదటి సినిమా రేయ్ కు రాజసింహగారు డైలాగ్స్ రాశారు. అలాగే మిక్కిగారితో సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాకు వర్క్ చేయడం ఆనందంగా ఉంది. రవికిషన్ గారితో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను. నిత్యామీనన్ గారికి, యూనిట్ సభ్యులకు అభినందనలు. నిర్మాతగారికి సినిమా పేరు తీసుకురావాలి’’ అన్నారు.

రెజీనా మాట్లాడుతూ ‘’సందీప్, నిత్యామీనన్, రాజసింహ సహా యూనిట్ కు ఆల్ ది బెస్ట్. రొటీన్ లవ్ స్టోరీకి మంచి మ్యూజిక్ అందించిన మిక్కి ఈ చిత్రానికి సంగీతం అందించడం ఆనందంగా ఉంది.

రవికిషన్ మాట్లాడుతూ ‘’ఈ సినిమాలో బ్యూటీఫుల్ క్యారెక్టర్ చేశాను. డిఫరెంట్ స్క్రిప్ట్, సందీప్ మంచి ఎనర్జిటిక్ నటుడు, రాజసింహ మాత్రమే చేయగల సినిమా ఇది. అంజిరెడ్డిగారు మంచి నిర్మాత. మంచి సినిమా అవుతుంది’’ అన్నారు.

దర్శకుడు రాజసింహ మాట్లాడుతూ ‘’నేను జయంత్ గారి వద్ద, అలాగే పరుచూరి బ్రదర్స్ దగ్గర అసోసియేట్ రైటర్ గా వర్క్ చేశాను. ఇండిపెండెంట్ రైటర్ గా కూడా 15 సినిమాలకు పనిచేశాను. 2007లో ఈ సినిమా కథను రాసుకున్నాను. రెండు, మూడు సార్లు స్టార్ట్ అయ్యి కొన్ని కారణాలతో ఆగిపోయిన సినిమా. ఈ కథను ఎలా ఎగ్జిక్యూట్ చేస్తావని చాలా మంది అడిగారు, నాతో పాటు నన్ను, నా కథను నమ్మారు. ఛోటా కె.నాయుడుగారు ఈ ప్రాజెక్ట్ ను టేక్ ఓవర్ చేసుకున్న తర్వాత సినిమా ట్రాక్ ఎక్కింది. బోగాది అంజిరెడ్డి వంటి నిర్మాతగారు ముందుకు వచ్చారు. ఈ సినిమాలో ఒక గంట పాటు సీజీ వర్క్ ఉంటుంది. కానీ అది తెలియదు. ఈ సినిమా కథలో ఎక్కువ భాగం హైటెక్ సిటీ ఫ్లై ఓవర్ పై జరుగుతుది. అక్కడా షూటింగ్ కుదరదు కాబట్టి అన్నపూర్ణ స్టూడియోలో సెట్ వేసి మిగతాదంతా గ్రాఫిక్స్ లో క్రియేట్ చేశాం. నిత్యాగారు నాలుగు గంటల పాటు కథ విని ఒప్పుకున్నారు. అద్భుతంగా సపోర్ట్ చేశారు. అలాగే సందీప్ నన్ను నమ్మి సపోర్ట్ చేశారు. నిర్మాత అంజిరెడ్డిగారికి థాంక్స్. ఒక్క అమ్మాయితప్ప అందరినీ నవ్విస్తుంది, ఎంటర్ టైన్ చేస్తుంది, ఎంగేజ్ చేస్తుంది’’ అన్నారు.

మిక్కి జె.మేయర్ మాట్లాడుతూ ‘’ఈ నెలలో నా మ్యూజిక్ లో విడుదలవుతున్న మూడో సినిమా. రాజసింహగారితో వర్క్ చేయడం ఆనందంగా ఉంది. చాలా టాలెంటెడ్ పర్సన్. చోటా కె.నాయుడుగారు నాకు చాలా ఇన్ స్పిరేషన్ ఇచ్చారు. ఆయనతో వర్క్ చేయడం ఎంజాయ్ చేశాను. నిత్యామీనన్ ఈ సినిమాలో పార్ట్ కావడం, ఆమెతో నేను వర్క్ చేయడం లక్ గా భావిస్తున్నాను.నిర్మాతగారికి మంచి పేరు తెచ్చే సినిమా అవుతుంది’’ అన్నారు.

నటీ నటులు – సందీప్ కిషన్, నిత్యా మీనన్ , రేవతి , రవి కిషెన్, అలీ, అజయ్,బ్రహ్మాజీ, తనికెళ్ళభరణి, రాహుల్ దేవ్, పృథ్వీ, సప్తగిరి, తాగుబోతు రమేష్,నళిని, జ్యోతి తదితరులు.

సినిమాటోగ్రాఫర్‌: ఛోటా కె.నాయుడు,

ఆర్ట్‌: చిన్నా,

మ్యూజిక్‌: మిక్కి జె.మేయర్‌,

ఎడిటింగ్‌: గౌతంరాజు,

పాటలు : శ్రీమణి, శ్రీ శశి జ్యోత్న్స మరియు డాక్టర్ మీగడ రామలింగ శర్మ ,

ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఆళ్ళ రాంబాబు,

సహ నిర్మాతలు : మాధవి వాసిపల్లి, బోగాది స్వేచ్ రెడ్డి ,

నిర్మాత: బోగాది అంజిరెడ్డి,

కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : రాజసింహ తాడినాడ

NO COMMENTS

LEAVE A REPLY