సక్సెస్ తో దూసుకుపోతున్న “నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్” :

130

లక్కీమీడియా బెక్కం వేణుగాపాల్ నిర్మాతగా దిల్ రాజు సమర్పించు హెబ్బా పటేల్ ,నోయెల్ ,పార్వతీశం ,అశ్విన్ ,రావు రమేష్ కలిసి నటించిన “నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్” విడుదల రోజు నుండి మంచి కలెక్షన్స్ తో పాటు అందరి మన్నలను పొందుతుంది .ఈ సందర్భం గా చిత్ర యూనిట్ సక్సెస్ టూర్ చేస్తోంది .నల్గొండ ,విజయవాడ ,గుంటూరు లో కొన్ని థియేటర్స్ లో చిత్ర బృందం ప్రేక్షకులతో తమ సక్సెస్ ని పంచుకుంది .

నిర్మాత బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ మా సినిమా విడుదల నుండి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఫుల్స్ తో రన్ అవుతుంది .నల్గొండ లో అసలు ప్రేక్షకులు కొన్ని సీన్స్ కి అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు.ఇలా వెళ్లిన ప్రతి థియేటర్ లో విశేష స్పందన రావటం చాలా సంతోషం గా ఉంది.ఇలానే విజయవాడ ,గుంటూరు తరువాత విశాఖపట్నం ,రాజమండ్రి,కాకినాడ ,శ్రీకాకుళం వరకు మా సక్సెస్ టూర్ సాగుతుంది అన్నారు .

NO COMMENTS

LEAVE A REPLY