ఫిబ్రవరి 14న నా పేరు సూర్య రెండో పాట…. మైనస్ 12 డిగ్రీస్ లో సరిహద్దులో షూటింగ్

10

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అనుఇమ్మాన్యూయేల్ జంట‌గా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతూ తెరకెక్కుతున్న చిత్రం “నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా”. కె. నాగబాబు సమర్పణలో, రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్లో శిరీష శ్రీధర్ నిర్మాతగా, బన్నీ వాసు సహ నిర్మాతగా ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ , శ‌ర‌త్ కుమార్ లు ముఖ్య పాత్రల్లో న‌టిస్తున్నారు.
ఫస్ట్ ఇంపాక్ట్ తో భారీ ఇంపాక్ట్ సంపాదించుకొని… అద్భుతమైన టీజర్ తో ప్రకంపనలు సృష్టించి…. సైనిక సాంగ్ తో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న నా పేరు సూర్యకు సంబంధించిన మరో పాటను ఫిబ్రవరి 14న విడుదల చేయబోతున్నారు. అంతే కాదు… ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ భారత సరిహద్దులో…. అది కూడా మైనస్ 12 డిగ్రీల సెల్సియస్ లో చేస్తున్నారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ…. నా పేరు సూర్య టీజర్ చూసిన వారంతా వావ్ అంటూ… ప్రశంసల జల్లు కురిపించారు. టీజ‌ర్ చూసిన వారంతా అల్లు అర్జున్ డెడికేష‌న్ గురించి, మేకోవర్ గురించి మాట్లాడుకుంటున్నారు. భావోద్వేగమైన సైనిక సాంగ్ ప్రతీ ఒక్క మనసును కదిలించింది. మేకింగ్ వీడియో సినిమా స్టామినాను చూపించింది. దీనికి కొనసాగింపుగా ఫిబ్రవరి 14న మరో సాంగ్ ను రిలీజ్ చేయనున్నాం. మరో వైపు ఈ చిత్ర షూటింగ్ భారత సరహద్దులో క్లిష్ణమైన ప్రదేశాల్లో జరుగుతోంది. మైనస్ 12 డిగ్రీల సెల్సియస్ లో ఈ షూటింగ్ చేస్తున్నాం. ఒరిజనల్ గా మన సైనికులు దేశం కోసం ఎలా పోరాడుతారో… మన హీరో అల్లు అర్జున్ సైతం… సినిమా మీదున్న భక్తితో… ఒరిజినల్ లొకేషన్స్ లో షూటింగ్ కు వాతావరణం అనుకూలంగా లేకపోయినా… సహజత్వం కోసం షూటింగ్ చేస్తున్నారు. కీలకమైన సన్నివేశాల చిత్రీకరణను మా దర్శకుడు వక్కంతం వంశీ పగడ్భందీగా ప్లాన్ చేశారు. బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్ – శేఖర్ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతం అందిస్తున్నారు. మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి సినిమాను 2018, ఏప్రిల్ 27న విడుదల చేస్తున్నాం. అని అన్నారు.

నటీనటులు
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అనూ ఎమ్మాన్యూఏల్ యాక్షన్ కింగ్ అర్జున్, శరత్ కుమార్ తదితరులు
సాంకేతిక నిపుణులు
ఎడిటర్ – కోటగిరి వెంకటేశ్వరరావు (చంటి)
ఫైట్స్ – రామ్ లక్ష్మణ్
సాహిత్యం – రామజోగయ్య శాస్త్రి
ప్రొడక్షన్ డిజైనర్ – రాజీవన్
సినిమాటోగ్రఫి – రాజీవ్ రవి
సంగీతం – విశాల్ – శేఖర్
ప్రొడక్షన్ కంట్రోలర్ – డి. యోగానంద్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – బాబు
బ్యానర్ – రామలక్ష్మీ సినీ క్రియేషన్స్
సమర్పణ – k.నాగబాబు
సహ నిర్మాత – బన్నీ వాసు
నిర్మాత – శిరీషా శ్రీధర్ లగడపాటి
రచన, దర్శకత్వం – వక్కంతం వంశీ

NO COMMENTS

LEAVE A REPLY