అల్లు శిరీష్, వి.ఐ.ఆనంద్, ఒక్క క్షణం సెట్లో సందడి చేసిన కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్.

158

అల్లు శిరీష్ హీరోగా, సురభి, సీరత్ కపూర్ హీరోయిన్లుగా, శ్రీనివాస్ అవసరాల ప్రధాన పాత్రలో విఐ ఆనంద్ దర్శకత్వంలో లక్ష్మీ నరసింహ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై చక్రి చిగురుపాటి నిర్మిస్తున్న చిత్ర షూటింగ్ బెంగళూర్ లో శరవేగంగా జరుగుతోంది. ఈ షూటింగ్ జరుగుతున్న సమయంలో కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ సందడి చేయడం విశేషం.

పునీత్ రాజ్ కుమార్ ఒక్క క్షణం విశెషాలు అడిగి తెలుసుకోవటమే కాకుండా అల్లు శిరిష్ ని మంచి హార్డ్ వర్కింగ్ యాక్టర్ అని తనకి మంచి భవిష్యత్ ఉందని కితాబిచ్చారు.. దర్శకుడు వి.ఐ ఆనంద్ సినిమా గురించి పునిత్ కి వివరించారు, చిత్ర విశేషాలు తెలుసుకొన్న పునిత్
ఒక్క క్షణం పెద్ద విజయం సాదిస్తుందని నమ్మకం కలుగుతుందని ఈ చిత్రాన్ని ధియేటర్ లో చూడాలి అని అనుకొటున్నట్లు తెలిపారు, తన ఈ సినిమా కథ కూడా చాలా ఇంట్రెస్ట్ కలిగిస్తోంది. టీం అందరికి అల్ ది బెస్ట్. అని అన్నారు.

హీరో అల్లు శిరీష్ మాట్లాడుతూ – కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గారి ఫ్యామిలీకి కి మా ఫ్యామిలీ కి చాలా సంవత్సరాలు గా అనుబంధం ఉంది. దాదాసాహెబ్ ఫాల్కె అవార్డ్ గ్రహిత లెజెండరి రాజ్ కుమార్ గారి ఫ్యామిలి తో తమ ఫ్యామిలి కి మంచి అనుభందం ఉందని తరచు కుటుంబ ఫంక్షన్స్ లో కలుస్తుంటాం అని ఇటివలె శివన్న (శివరాజ్ కుమార్) తగరు చిత్రం టీజర్ లాంచ్ కి సైతం తాను హాజరు కావటం ఆనందాన్ని పంచిందని ఈ రోజు పునిత్ తమ సెట్ కి రావటం చాల హ్యాపిగ ఉందని అన్నాడు. ఆయనకు ఈ సందర్భంగా మా టీం తరపున థాంక్స్ చెబుతున్నా. అని అన్నారు. ఒక్క క్ష ణం చాల బాగ వస్తుందని ఈ సినిమా విషయం లొ చాల ఎగ్సైటింగా ఉన్నట్లు శిరిష్ తెలిపాడు

నటీనటులు – అల్లు శిరీష్, సురభి, సీరత్ కపూర్, శ్రీనివాస్ అవసరాల, వెన్నెల కిషోర్, సత్య, ప్రవీణ్, కాశీ విశ్వనాథ్, రోహిణి తదితరులు

కో ప్రొడ్యూసర్స్ – సతీష్ వేగేశ్న, రాజేష్ దండ
సంగీతం – మణిశర్మ
డిఓపి – సుజిత్ వాసుదేవ్
డైలాగ్స్ – అబ్బూరి రవి
ప్రొడక్షన్ డిజైనర్ – రాజీవన్ జి
ఎడిటర్ – ఛోటా కె ప్రసాద్
ఆర్ట్ – నాగేంద్ర ప్రసాద్
క్రియేటివ్ హెడ్ – సంపత్ కుమార్
కో డైరెక్టర్ – విజయ్ కామిశెట్టి

బ్యానర్ – లక్ష్మీ నరసింహ ఎంటర్ టైన్ మెంట్స్ ప్రొడక్షన్ నెం.5
నిర్మాత – చక్రి చిగురు పాటి
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ – విఐ ఆనంద్

NO COMMENTS

LEAVE A REPLY